Monday 4 July 2016

అమరావతి వాసులకి మంచి రోజులు !

అమరావతి వాసులకి మంచి రోజులు !

amaravati images
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలన్నీ అమరావతికి తరలివెళ్లాయి.దింతో అమరావతిలో ప్రజల్లో ఆనందం ఏర్పడింది ఎందుకు అంటే గుంటూరు,విజయవాడ లో ప్రభుత్వ ఉద్యోగులతో కిల కిల లాడుతుంది వ్యాపారులకు పండగే పండగ . ఆంధ్రప్రదేశ్ లో రేపోమాపో ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల రాకతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒకవైపు కృష్ణమ్మ, మరోవైపు దుర్గమ్మ ఆశీస్సులతో త్వరితగతిన రాజధానిని ప్రగతి బాటలో నడిపేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల రాక వల్ల ఉద్యోగులు ఎంత హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదు కానీ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉంటున్న పెళ్లికాని ప్రసాదులకు మాత్రం బాగా కలిసొచ్చింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉంటున్న కుర్రాళ్ల పంట పండినట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా సంబంధం, ఆస్ట్రేలియా సంబంధం కోసం పాకులాడిన అమ్మాయి తల్లిదండ్రులు నేడు మాత్రం తమ ఆలోచనను మార్చుకున్నారు. దేశం కాని దేశం పంపించి ఎప్పుడో సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో చూసుకుంటూ బాధపడే కంటే, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఇచ్చుకుంటే నెలకోసారైనా కూతురి కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.తమ అల్లుడికి పొలం ఉంటే చాలు అని అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారట.
ఎలాగూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఈరోజు కాకపోతే రేపైనా ఐటీ తరలిరాక తప్పదు. అలాంటప్పుడు ఎక్కడో ఇచ్చుకోవడం ఎందుకు ? అని పిల్ల తల్లిదండ్రులు ఎదురు ప్రశ్నిస్తున్నారట. అంతేకాకుండా చేసుకోబోయే కుర్రాడికి చదువు ఉన్న లేకపోయినా  అమరావతి ప్రాంతంలో ఎకరం పొలం ఉన్నా చాలు ఏ పనీచేయాల్సిన అవసరం లేకుండా తమ కూతురు దర్జాగా కూర్చోవచ్చనే ధీమా కూడా తల్లిదండ్రులకు బానే పెరిగిపోయింది. ఇదిలా ఉంటే అమరావతి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉంటున్న కుర్రాళ్లు కొంతమంది బైక్‌ల మీద తిరగడం మానేసి కార్లలో తిరుగుతున్నారట. ఇంకొంతమందైతే అడ్వాన్స్ అయిపోయి ఏకంగా గుర్రాలపై షికార్లు చేస్తున్నారట. వినడానికి అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. రాజధాని ప్రాంతంలో ఉన్న కుర్రాడికి జాబ్ ఉందా లేదా అనే విషయం కన్నా పొలం ఉందా లేదా అనే ధోరణిలోనే పిల్ల తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అంతేకాదు, పొలం ఉన్న అల్లుళ్లకు కట్నం లక్షల నుంచి కోట్ల వరకూ ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదట. దీనికి కారణం గుంటూరు, విజయవాడ, తుళ్లూరు ప్రాంతాల్లోని భూములు కోట్లలో పలకడమే. సో ఇది అమరావతి అల్లుళ్లకు కలిసొచ్చే కాలమన్నమాట. అంతా రాజధాని మహిమ.

0 comments:

Post a Comment