Sunday 3 July 2016

అక్కినేని వారింట పెళ్లిబాజాలు?

అక్కినేని వారింట పెళ్లిబాజాలు?

akhil love img
chitanya and samantha images

హైదరాబాద్:  తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన చైతు,సమంత మరియు  అఖిల్  లవ్ గాశిప్స్ ఇప్పటికి తీరింది అదే నండి సస్పెన్స్‌ వీడింది? తెలుగు యాక్టర్స్ నాగచైతన్య, సమంత పెళ్లిపీటలెక్కనున్నారు అంట!! వచ్చే డిసెంబరులోనే అక్కినేని వారింట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఒక్క పెళ్లి కాదు అండో. అక్కినేని నాగార్జున తనయులు ఇద్దరూ ఆ నెలలోనే పెళ్లికొడుకులు కానున్నారు. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంత.. రెండో కుమారుడు అఖిల్‌, ఆయన చిరకాల స్నేహితురాలు డిజైనర్‌ శ్రియా భూపాల్‌ జోడీలకు పెళ్లి కానుంది. నాగచైతన్య, చెన్నైకి చెందిన సమంత 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ చిత్రాల్లోనూ కలిసి నటించారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు వచ్చిన వార్తలని కి సమాధానం గా నిలిచారు . ఇద్దరూ కలిసి ఒక థియేటర్‌లో సినిమా చూశారంటూ నెట్‌లో ఫొటోలు కూడా హల్‌చల్‌ చేశాయి. అయితే, ఆ వార్తలపై ఇద్దరూ నోరు విప్పలేదు. మెడలో ‘ఎన్‌’ అనే అక్షరం ఉన్న లాకెట్‌ ధరించిన సమంత ఫొటోలు కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.తన లవ్ చేస్తున్న ప్రేమికుడు పేరు మొదటి అక్షరం "ఎన్"అని తెలియచేసిన విషయం తెలిసిందే .  ఆ అక్షరం తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని సమంత చెప్పడం గమనార్హం. మొత్తమ్మీద. అక్కినేని అందగాళ్లు ఇద్దరూ తాము ఇష్టపడిన అమ్మాయిలను పెద్దల అంగీకారంతోనే మనువాడబోతున్నారు అని సినిమా వర్గాలు చెబుతున్నాయి . 

Amaravati Telugu News Updates, Online Telugu News Updates, Telugu News Updates, Movie Telugu News Updates,Chitanya And Samantha Love News, Akhil Love News.

0 comments:

Post a Comment