Tuesday 5 July 2016

ప్రతి ఇంటికి వెళ్ళాలి !

ప్రతి ఇంటికి వెళ్ళాలి !

JAGAN IMAGES
హైదరాబాద్:  ప్రజలకి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఈ పార్టీ ఉంటుంది ప్రజలకోసమే ఈ పార్టీ పెట్టాము అని చెప్పిన జగన్ బాబు గత కొన్ని రోజుల క్రితం ఓదార్పు యాత్ర అని వైస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త తో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబాన్ని పరామర్శించిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అదే బాటలో మళ్ళీ "గడప గడప "అని  ఒక కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలపై 100 ప్రశ్నలు సంధిస్తూ ‘గడప గడపకూ వైసీపీ’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలకు పార్టీ అధ్యక్షుడు మన ప్రతి పక్ష నేత  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే క్షమించనని హెచ్చరించారు. గడప గడపకూ వైసీపీ కార్యక్రమం విజయవంతమైతే .. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తామన్నారు.మనం అధికారం లోకి వస్తాం అని పార్టీ పెద్దలకి చెప్పారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలతో జగన్‌ సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఐదు నెలల పాటు నిర్వహించనున్న ‘గడప గడపకూ వైసీపీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ‘చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలపై 100 ప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారు. అందుకే ఆయన విజయం సాధిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకోవద్దు. ఐదు నెలలూ ప్రజలకు చేరువలో ఉండాలి. ఎక్కడైనా.. ఎవరైనా నిర్లక్ష్యం చేశారని సమాచారం వస్తే క్షమించను. వారి స్థానంలో కొత్తవారిని సమన్వయకర్తలుగా నియమిస్తాను’ అని స్పష్టం చేశారు. అసవరమైతే కార్యక్రమాన్ని మరో నెల పొడిగిద్దామన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ తరపున కరపత్రాలు, జెండాలు పంపించాలని కొందరు నేతలు కోరారు. స్పందించిన జగన్‌.. వెంటనే ఈ అంశాన్ని పరిశీలించాలని ఎంపీ విజయసాయిరెడ్డికి సూచించారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు ఎన్నో హామీలు గుప్పించారని, రెండేళ్లయినా వాటిని నెరవేర్చలేదని జగన్‌ అన్నారు.ప్రజల కోసమే ఈ పార్టీ ఉంది అని  రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విసుగు నెలకొందని, హామీలు నెరవేరడం లేదని, పాలన జరగడం లేదని విమర్శించారు. రోడ్ల విస్తరణ పేరిట దేవాలయాల కూల్చివేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని పార్థసారథి అన్నారు. ‘గడప గడపకూ వైసీపీ’లో చంద్రబాబు పాలనపై 100 ప్రశ్నలు సంధిస్తున్నామని పెద్దిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాలనను గురించి ప్రజలకు వివరిస్తామని, వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని తెలిపారు.మరి ఈ కార్యక్రమము వల్ల అయిన మంచి రెస్పాన్స్ వస్తుంది అని వైస్సార్  పార్టీ భావిస్తుంది . 

Amaravati Telugu News Updates, Telugu News Updates, Telugu News, AP News, TS News, Jagan Mohan Reddy Update Telugu News, YSR Party News.

0 comments:

Post a Comment