Friday 8 July 2016

MLA పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తి?

MLA పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తి?

babu meeting images
అమరావతి:  ఆంధ్రప్రదేశ్ ప్రజల సర్వే లో మొత్తం మీద  ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తి పార్టీ ఎమ్మెల్యేలపై లేదని సీఎం చంద్రబాబు చేయించిన సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై 80 శాతం ప్రజలు సంతృప్తితో ఉన్నారని, అయితే 40 శాతం ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రమే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సర్వేలో వెల్లడైంది.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ఓ సర్వే చేయించారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది,ప్రభుత్వం చేపట్టిన పధకాలు ప్రజలకి చేరుతున్నాయా? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వంటి అంశాలపై సర్వే నిర్వహించారు. గురువారం సీఎం చంద్రబాబు  నివాసంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో 5 గంటలపాటు జరిగిన సమావేశంలో ప్రభత్వం చేపట్టిన  ఈ సర్వే వివరాలను చంద్రబాబు వెల్లడించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు. సర్వేలో అధికశాతం ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నా ఎమ్మెల్యేల పనితీరుపై వారి ప్రవర్తన మాత్రం అంతగా  సంతృప్తిగా లేరని తేలింది. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి 8 అంశాలపై సర్వే నిర్వహించిన సీఎం .ఈ  సర్వేలో.. 40-45 శాతం ఎమ్మెల్యేల పనితీరు బాగుందని  ప్రజలు తెలియచేశారు అని తేలింది. మరో 30- 35 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. 25-30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, 10 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు మరీ బాగాలేదని ప్రజలు పటించుకోవడం లేదు అని  స్పష్టం చేశారు. భేటీలో సర్వే వివరాలను వెల్లడించిన సీఎం. ఎమ్మెల్యే పనితీరు మెరుగునకు ఏం చేయాలన్న దానిపై చర్చించారు. పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలకు సర్వే ఫలితాలను ఇచ్చి, పనితీరు ఎలా మెరుగుపర్చుకుంటారో చెప్పాలని అడగాలా లేఖ  మరో ఏ విధంగా వాళ్ళ కి చెప్పాలని సీఎం , ఆ పార్టీ మంత్రులని,సహచర నేతలని కోరారు. అదే విధంగా పర్వాలేదన్న కేటగిరీలో ఉన్న ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారన్న కేటగిరీలోకి వచ్చేలా చూడాలని ఏ విధంగా చేస్తే ప్రజలు సంతృప్తిగా ఉంటారు , దానికి ఏం చేయాలో కూడా సూచించాలని  బాబు గారు కోరారు. ఈ అంశంపై చర్చించిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరు మెరుగునకు 10 మందితో ఓ కమిటీని నియమించాలని ఆ కమిటీ ద్వారా ప్రజలకి ఎలా దగ్గర అవ్వాలి పధకాలు ఎలా చేరాలి అని వివరించారు. ఈ  కమిటీలో ముఖ్య నేతలు  తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, విప్‌ మేడా మల్లిఖార్జునరెడ్డి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కొవ్వూరు ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ శుక్రవారం సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కానుంది.అదేవిధంగా ఇప్పటి వారికి చేపట్టిన కార్యక్రమాలని అని ప్రజలకి ఏ విధంగా అందిన విషయం సర్వే వెల్లడి అయిన సమాచారాన్ని తెలియచేసారు. ఆ సర్వేలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన 28 పథకాలపై సర్వే చేపించగా . ఆ ప్రభుత్వ పథకాల్లో ఎన్టీఆర్‌ వైద్య పరీక్షలకు మొదటి  స్థానం, ఎన్టీఆర్‌ వైద్యసేవకు రెండోస్థానం, ఫించన్ల పంపిణీకి మూడోస్థానం, పౌరసరఫరాల శాఖకు నాలుగోస్థానం వచ్చింది. ఇసుక అంశంపై సర్వేలో 82 శాతం బాగుందని ప్రజలు భావించారు అని  వచ్చిందని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉచితంగా ఇస్తున్న ఇసుక కి ఎందుకు 100 శాతం రాలేదు అని సీఎం వ్యాఖ్యానించారు. 

Amaravati Telugu News Updates, Online Telugu News Updates, Telugu News Updates,AP News, TS News, Andhra Pradesh News, Today News,Amarvati Today News.


0 comments:

Post a Comment