Thursday 7 July 2016

ఏపీకి వరాలు ? AP Package

ఏపీకి  వరాలు ?

special package
ఢిల్లీ:  రాష్ట్ర విభజన లో నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్‌ కి  ఆర్థిక ప్యాకేజీ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.బిజెపి తో పొత్తు పెట్టుకున్న టిడిపి ప్యాకేజీ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు అని ఇప్పటికే చాలా లేటు అయింది అని ప్రధాన మంత్రి కార్యాలయం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు సమాచారాన్ని సేకరించింది. పలు దఫాలుగా ఆయా శాఖలతో చర్చలు జరుపుతోంది. అయితే, ఈ కసరత్తు తేలే వరకూ పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపించటం లేదు అక్కడి శాఖ అధికారులు చెబుతున్నారు.పోలవరం ప్రాజెట్ కేంద్రమే భరిస్తుంది అని చూపిన ప్రభుత్వం ఇపుడు పోలవరం నిధులనూ ప్యాకేజీలో భాగంగానే ప్రకటించాలని కేంద్రం భావిస్తుండటమే దీనికి కారణం. పోలవరానికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయన్న దానిపై జలవనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్‌తో పీఎంవో పలుమార్లు కేంద్రం  చర్చించింది. ఈ నేపథ్యంలో నాబార్డు నుంచి రుణం తీసుకోవాలి అని నిర్ణయంచిన ప్రభత్వం ఇప్పుడు ఆ  ప్రక్రియ కూడా ప్రస్తుతానికి నిలిచిపోయింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేల కోట్లని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పోలవరానికి రూ.100 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు  ఇప్పటి వరకూ రూ.350 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.2500 కోట్లను కూడా కేంద్రమే  తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు ఇచ్చిన నిధుల పట్ల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కూడా  అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరానికి రూ.1600 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరుతూ కేంద్ర జలవనురుల శాఖ మంత్రి  లేఖ రాశారు. మరోవైపు పోలవరానికి ఈ ఏడాది రూ.4000 కోట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. 2018లోపు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ ప్రాజెక్టు వాళ్ళ ఆంద్రప్రదేశ్ ని కరువు రహితం గా తీర్చి దిద్దాలి అన్ని ఆ రాష్ట్ర ప్రభత్వం మళ్ళీ ఒకసారి గుర్తుచేసింది.  చంద్రబాబు రాసిన లేఖ కి స్పందించిన  కేంద్రం నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని  ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దానికి అనుమతులు రావటం కూడా లాంఛనప్రాయమేనని సంబంధిత అధికారులు అభిప్రాయపడ్డారు. కానీ, పీఎంవో జోక్యంతో పరిస్థితి మారిపోయింది. ప్రత్యేక ప్యాకేజీ కింద వివిధ ప్రాజెక్టులను, భారీగా నిధులను కేంద్రం ఏపీకి ఇవ్వాలని భావిస్తోందని, పోలవరానికి నిధులు కూడా ఈ ప్యాకేజీలో భాగంగానే ఉంటాయని ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ఉన్నతాధికారి ఒకరు బుధవారం మీడియా కి చెప్పారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఆ మేరకు నిధులు కేంద్రం ఇస్తుందా? అని అడగ్గా మరియు ప్రత్యేక ప్యాకేజి లోనే పోలవరం నిధులు ఇస్తాం అంటే ఏంటి ?.. రూ.30 వేల కోట్ల వరకూ పోలవరానికి ఇవ్వాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో కేంద్రం ఇస్తుందని చెప్పారు. బహుశా అది నాబార్డు రుణం కూడా కావొచ్చునని తెలిపారు. ప్యాకేజీలో భాగంగా ఇచ్చేందుకే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందా? అని అడగ్గా.. ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. రుణం రూపంలో నిధులు ఇచ్చినా దానిని తిరిగి చెల్లించేది కేంద్రనీదే భాద్యత అని , రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు. 


0 comments:

Post a Comment