Saturday 9 July 2016

అమరావతి లో చైనా స్పీడు రైళ్లు! High Speed Rail in Amaravati

అమరావతి లో చైనా స్పీడు రైళ్లు!

china speed rail
అమరావతి:  ఆంధ్రప్రదేశ్ అభివృధి కార్యక్రమము గా ఏపీ సీఎం చంద్రబాబు గత నెలలో చైనా పర్యటన చేశారు అక్కడి ప్రభుత్వం తో చేసిన చేర్చలు ఫలించాయి అని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం.  చైనా పర్యటన సందర్భంగా బాబు గారు  చేసిన ప్రతిపాదనలు ఆచరణలోకి రాబోతున్నాయి. అదేనండి మన  ఆంధ్రప్రదేశ్‌కు చైనా స్పీడ్‌ రైళ్లు హైస్పీడ్‌తో  అమరావతి కి రానున్నాయి. అంతేకాదూ. రాజధాని నగరం అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనలకి కి ఏర్పాటు కూడా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి అని ఆ రాష్ట్రసానికి తెలియచేసిన సీఎం చంద్రబాబు ఇప్పడు రాష్ట్రంలో సమీకృత నీటి యాజమాన్య విధానంలోనూ భాగస్వామి కావడంపై చైనా బృందం  దృష్టి సారించింది. ఈ అంశాలపై చర్చలకు రడీ గా  సిద్ధపడింది. సీఎం చంద్రబాబు,మంత్రులు యనమల రామకృష్ణుడు,నారాయణ నేతలు గత నెల చివరి వారంలో చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో. చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ యాజమాన్యంతో ఆంధ్రప్రదేశ్ బృందం సమావేశమైంది. రాష్ట్రంలోనూ స్పీడ్‌ రైళ్లను ప్రారంభించాలని,అక్కడ చాలా వసతులు ఉన్నాయి అని  సీఆర్‌సీసీని చంద్రబాబు కోరారు. అమరావతి నుంచి విశాఖపట్నం, అమరావతి నుంచి తిరుపతికి రెండు స్పీడ్‌ రైళ్లను నడపాలన్న ప్రతిపాదనను సీఆర్‌సీసీ ముందు ఏపీ సీఎం  చంద్రబాబు ఉంచారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు సీఆర్‌సీసీ సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం చైనా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చి పట్టుమని పది రోజులైనా కాకుండానే  మంచి కబురు పంపిన చైనా అమరావతి నుంచి స్పీడ్‌ రైళ్లను నడపడంపై చర్చిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఆర్‌సీసీ వర్తమానం పంపింది. దీంతో, ఈ నెల 12న ఢిల్లీలో సీఆర్‌సీసీ ప్రతినిధులతో టిడిపి కేంద్ర మంత్రులు పూసపాటి అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి భేటీ కానున్నారు.చంద్రబాబు గారి పర్యటన ఒక మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి అని ఆ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. 
Amaravati Telugu News Updates, Online Telugu News Updates, AP News, TS News, Andhra Pradesh, China Speed Rail Launched  In Amaravati.

0 comments:

Post a Comment