Wednesday 6 July 2016

జగన్ కి ఆర్థిక కష్టాలు!

జగన్ కి ఆర్థిక కష్టాలు!

jagan
హైదరాబాద్‌:  గత కొన్ని రోజుల నుంచి జగన్ ఆస్తుల ఈడీ అటాచ్‌మెంట్లతో గడ..గడలాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పార్టీ నిర్వహణ కోసం డబ్బులు వెతుక్కుంటోంది.ఇప్పటి వరకి ఏ కార్యక్రమము కి అయిన పార్టీ ముందు ఉండేది కానీ ఇప్పుడు ఆ పార్టీ భరించే శక్తి లేదు అని పార్టీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే కార్యక్రమాలకి  ఖర్చులన్నీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులే పెట్టుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్టుగా చెప్పారు. పార్టీకి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆర్థికంగా ఉన్నవారిని పార్లమెంటరీ నియోజక వర్గాల ఇన్చార్జులుగా ప్రకటించాలని నిర్ణయించారు. 
"గడపగడపకు" వైసీపీ పేరుతో సుదీర్ఘ కార్యక్రమాన్ని జగన్ ప్రకటించారు. ఇది దాదాపు ఆరు నెలలపాటు సాగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం రూ. 50 లక్షలు ఖర్చు అవుతుందని ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల అంచనా. అయితే కేవలం స్టేషనరీ మాత్రమే కేంద్ర కార్యాలయం నుంచి వస్తుందని పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రకటనతో నేతలు షాక్‌కు గురయ్యారు. ఈడీ కేసులు ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడం, ఆర్థిక చక్రబంధం నుంచి బయటకు రావడం అంత తేలిక కాదనుకుంటున్న జగన్ జిల్లా స్థాయిలో పార్టీ పోషకులను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పార్లమెంటరీ ఇన్చార్జులను ప్రకటించాలని భావిస్తున్నారు. స్థితిమంతులు, బాగా సంపాదించిన మాజీ కాంగ్రెస్‌ నేతల పేర్లను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. వీరి చేరికలను వచ్చే రెండు, మూడు నెలల్లో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

0 comments:

Post a Comment