Wednesday 6 July 2016

పట్టిసీమ కృష్ణ ,గోదావరి బిరబిరా !

 పట్టిసీమ కృష్ణ ,గోదావరి బిరబిరా !

pattisima images
అమరావతి,నెల్లూరు:  ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన ప్రాజెక్ట్లు లు లో పరుగులు తీస్తున్న గోదావరి,కృష్ణ గలగలా గోదావరిబిరబిరా పరుగులిడుతూ కృష్ణమ్మలో కలవనుంది!చంద్రబాబు చేపట్టిన "పట్టిసీమ" ఫలాలు పూర్తిస్థాయిలో లభించేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం పట్టిసీమ ఎత్తిపోతల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా డెల్టాకు గోదావరి వరద జలాలు విడుదల చేయనున్నారు. బుధవారం ఉదయం చంద్రబాబు నేరుగా పట్టిసీమ ఎత్తిపోతలకు చేరుకుంటారు.ఈ కార్యక్రమంలో బాబు గారు  రెండు పంపుల ద్వారా గోదావరి వరద జలాలను పోలవరం కుడికాల్వకు విడుదల చేస్తారు. గోదావరి జలాలు కుడి కాల్వలో కలిసే చోట పూజలు చేసి. నీటిని కృష్ణమ్మ వైపు సాగనంపుతారు. రెండు పంపుల ద్వారా రోజుకు 8.5 క్యూసెక్కుల చొప్పున దాదాపు 80 రోజులపాటు నిర్విరామంగా నీటి విడుదల సాగేలా చర్యలు చేపట్టారు. గోదావరిలో వరద ఉధృతి ఉండడంతో కృష్ణా డెల్టా రైతులను ఆదుకునేందుకు ఈసారి ముందస్తుగానే వరద జలాలను మళ్లిస్తున్నారు. ఇదివరకు పట్టిసీమ నుంచి ఎనిమిది టీఎంసీలనే మాత్రమే వాడుకున్నారు. ఈసారి కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీరందించేలా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో మంత్రులు దేవినేని ఉమ, పీతల సుజాత మంగళవారం పోలవరం కుడికాల్వ పనులను, పట్టిసీమ ఎత్తిపోతలను పరిశీలించారు. ‘పశ్చిమ డెల్టాలో రైతులకు లోటు లేకుండా ఎటువంటి కరువు లేకుండా ఉండడానికి  గోదావరిలో వృథా వరద జలాలను మాత్రమే కృష్ణకు మళ్లిస్తున్నాం అని ప్రకటించారు.
 బాబు  పోలవరం పై సమీక్ష:
పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల ప్రారంభించిన అనంతరం.చంద్రబాబు గారు  పోలవరం పనులపై  సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లి, పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తారు. తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పనులపై అధికారులతో సమీక్షిస్తారు. జర్మనీకి చెందిన బావర్‌ సంస్థ చేపట్టిన డయాఫ్రమ్‌ వాల్‌ పనులకు వర్షాలతో అంతరాయం కలుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌ నెలాఖరు నాటికి పోలవరం కుడి ప్రధాన కాలువ పనులు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. కానీ, ఏడు ప్యాకేజీలలో రెండింటి పనులు మిగిలే ఉన్నాయి. రెండో ప్యాకేజీలో 1,61,600 క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మిగిలి ఉన్నాయి. నాలుగో ప్యాకేజీలో 3866 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మిగిలి ఉన్నాయి. ఐదో ప్యాకేజీలో 89,189 క్యూబిక్‌ మీటర్ల మట్టి, 25,729 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మిగిలి ఉన్నాయి. ఆరో ప్యాకేజీలో 3500 క్యూబిక్‌ మీటర్ల మట్టి, 11,202 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఏడో ప్యాకేజీలో 7023 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాల్సి ఉంది. పోలవరం కుడి ప్రధాన కాలువ పనుల వేగాన్ని పెంచాలని, ఇదే సమయంలో డయాఫ్రం వాల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనుల వేగాన్ని పెంచడంపై దృష్టి సారించాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌సా్ట్రయ్‌ను సీఎం ఆదేశించనున్నట్లు తెలిసింది. కేవలం కేంద్ర నిధులపై ఆధారపడి, పనుల వేగాన్ని తగ్గించకుం డా... ముందుగా రాష్ట్ర నిధులతో పనులు పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులను చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. పోలవరంపై బుధవారం నాటి సమీక్షలో ఆయన పూర్తిస్థాయి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడంతోనే తన పని అయిపోయినట్లుగా కేంద్రం భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018లోగా పూర్తి చేస్తామని పార్లమెంటులో హామీ అమలు దిశగా అడుగులు వేయడం లేదు. నిర్మాణ బాధ్యతను స్వీకరించలేదు. పోలవరం నిర్మాణం కోసం రూ.2200 కోట్లను రీయింబర్స్‌మెంట్‌ చేయాల్సి ఉంది. నిధుల విడుదలపై మాట దాట వేస్తున్న కేంద్రం... నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు మాత్రం సిద్ధమైంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తరచూ పోలవరం ప్రాజెక్టును ప్రాంతాన్ని సందర్శించి పనుల వేగాన్ని, నాణ్యతను పరిశీలించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మొత్తానికి పెత్తనం కేంద్రానిది .. ఆర్థిక భారం రాష్ట్రానిది అన్నట్లుగా మారింది. బుధవారం నాటి సమీక్షలో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చే అవకాశముంది.

Amaravati Telugu News Updates, Online Telugu News Updates, AP News, TS News, Patisima News Updates, Telugu News ,Today LatestNews.

0 comments:

Post a Comment