Monday 21 November 2016

ప్రాణాలు తీసిన రెండువేల నోటు

ప్రాణాలు తీసిన రెండువేల నోటు 

అమరావతి:
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన కొత్త నోట్లతో ప్రజలు త్రీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిల్లర కష్టాలుకి ప్రజల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా కాటేస్తూనే ఉన్నాయి. పెద్ద రూ.2 వేలు నోటుకు చిల్లర దొరక్కపోవడం సాధారణ ప్రజలకి ఏమి చేయాలో తెలియక సతమతం అవుతున్నారు, ఫలితంగా సమయానికి వైద్యం చేయించుకోలేక ఓ గిరిజనుడు మృతి చెందిన విషాదం తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగబోయిన కృష (45) వ్యవసాయ పనులతో పాటు తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా అతను ఆస్తమాతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పత్తిని ఓ వ్యాపారికి విక్రయించగా రూ.2 వేల నోటు ఇచ్చాడు. ఆస్తమా సమస్య పెరగడంతో వైద్య ఖర్చులకు రూ.2 వేల నోటుకు చిల్లర కోసం రెండురోజులుగా ప్రయత్నించాడు. ఎట్టకేలకు ఆదివారం పెద్ద నోటుకు చిల్లర దొరికినా.. . అప్పటికి చలి తీవ్రత పెరగడంతో కృష్ణకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో వైద్యం చేయించుకునేందుకు సాయంత్రం మోటారు సైకిల్‌పై బయలు దేరాడు. గ్రామ పొలిమేరల్లోకి వెళ్లేసరికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.పెద్ద నోట్లతో ఇంకా ఎంతమంది ప్రాణాలని కోల్పోతారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండువేల రూపాయలు నోట్ల వాళ్ళు ఇప్పటికే సాధారణ ప్రజలు తినడానికి కూడా కష్టపడుతున్నారు. వెంబటేనే సాధారణ ప్రజలకి వీలుగా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి అని ప్రజలు కోరుకుంటున్నారు . 
ఆంధ్రప్రదేశ్ ప్రజల చిల్లర కష్టాలు తీర్చేందుకు బాబు కేంద్రానికి కి ఫోన్ :
నోట్ల కోసం పాట్లు పడుతున్నవారికి సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. కరెన్సీపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. అనంతరం రాష్ట్రానికి కొత్తనోట్లు పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఉర్జిత్ పటేల్ సానుకూలంగా స్పందించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రేపు రాష్ట్రానికి రూ. 2,200 కోట్ల కరెన్సీ వస్తుందని, అందులో రూ. 400 కోట్ల చిన్ననోట్లు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆర్‌బీఐ రాష్ట్రానికి రూ. 8 వేల కోట్లను పంపింది. మరో రూ. 7, 8 వేల కోట్లు అవసరం ఉంటుందని అధికారుల అంచనా వేశారు. నోట్లు రాష్ట్రానికి తీసుకువచ్చే అంశంపై మట్లాడేందుకు ముంబయికి పంపిన ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అజయ్‌కల్లాంను అక్కడే ఉండాలని సీఎం ఆదేశించారు.ప్రజల కష్టాల ను తీర్చడానికి చంద్రబాబు చాల ప్రయత్నిస్తున్నఅని తెలియచేసాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉండే పెద్ద టెంపుల్స్ లోని చిల్లర ని కూడా ప్రవేశ పెట్టాము అని అన్ని విధాలుగాసి ప్రయత్నిస్తున్న అని తెలియచేసాడు . 

0 comments:

Post a Comment