Friday 18 November 2016

ప్రజలకి ఇల్లు స్థలం పట్టాలు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు

ప్రజలకి ఇల్లు స్థలం పట్టాలు  పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు

chandrababu images
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్రా రాష్ట్రము అభివృద్ధి ఫై అడుగులు అడుగులు వేస్తున్నారు. ప్రజలకి మేలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చాల కృషి చేస్తున్నారు. అదే కార్యక్రమంలో విశాఖపట్నం ప్రజల మనసు దోచుకోవడానికి ప్రభుత్వ స్థలాలని అక్రమంగా ఆక్రమించిన వాటిని తన చెల్లలకి రాసిఇస్తున్న అని వాఖ్యానించారు.   రాజకీయ లబ్ధి కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రజల సొమ్ము దోపిడీ చేసిన  దోపీడీదారులకు మద్దతిస్తారో.. . ప్రజా సంక్షేమం కోసం రేయింబవళ్లు పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతిస్తారో ఆలోచించుకోవాలని? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరారు. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా ఎటువంటి పని చేయడానికి అయిన  సిద్ధమని ప్రతి ఇంట్లో ఒక కొడుకుగా,అన్న గా అండగా ఉంటానుఅని  స్పష్టం చేశారు. ఆ విషయంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో కేంద్రం సహకారం అవసరమనే భావనతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నామని చెప్పారు. విశాఖ జిల్లా చోడవరంలో గురవారం నిర్వహించిన జనచైతన్యయాత్రలో ప్రజలని కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ  సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘పదేళ్లు హైదరాబాద్‌లో ఉండి పరిపాలన చేసుకునే అవకాశమున్నా రెండేళ్లలోనే అన్ని విభాగాలను కొత్త రాజధానికి తీసుకొచ్చి సొంతగడ్డ మీద నుంచి పాలన చేసుకునేలా చర్యలు తీసుకున్నాను. నాకంటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవారు ఎవరున్నారు? తండ్రిని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు సంపాదించినవారు, అనుభవం లేనివారు, సమాజం పట్ల గౌరవం లేని కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు.ప్రజలకోసమే పెట్టిన పార్టీ అని ప్రజల కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని తెలియచేసారు . 
కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వలేదని, దానివల్ల వచ్చే ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీకి తాను అంగీకరిస్తే దానిని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. ఇప్పటికే ఎక్కువ సమయం అయిపోయింది అని అందుకే అంగీకరించ అని వాఖ్యానించారు .  హోదా వల్లే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రజలని,విద్యార్థులని  తప్పు దారి పట్టిస్తున్నారు . హోదా వల్ల అదనంగా ఏమేమి వస్తాయో తనకు తెలియనివేమైనా ఉంటే.. వాటి గురించి చెబితే.. సాధించడానికి తనవంతు కృషిచేస్తానన్నారు. ‘గత ఏడాది పది వేల టీచర్‌ పోస్టులు భర్తీచేయగా, ఇటీవల 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చాం. త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు ఇస్తాం’ అని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. నోట్ల రద్దుతో రాష్ట్రంలో ఎలాంటి సమస్యలున్నాయో తెలుసుకునేందుకు తొమ్మిది ప్రశ్నలతో లక్ష మంది నుంచి తాను ఫోన్‌ ద్వారా సమాచారం తెప్పించుకున్నానన్నారు. వాటి ఆధారంగా సమస్య పరిష్కారానికి కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. ప్రజలంతా తమ డబ్బును జన్‌ధన్‌ ఖాతాల్లో జమ చేసుకుని మొబైల్‌ ద్వారా, రుపీ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు. కంప్యూటర్‌పై ప్రజలకు అవగాహన పెరుగుతున్నందున అందరూ కార్డు ద్వారా షాపింగ్‌ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పారు. తన ఆలోచన కార్యరూపం దాల్చితే అన్ని దుకాణాల్లో స్వైపింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలు తమ ఖాతాలోని బ్యాలెన్స్‌ ఆధారంగా నిత్యావసరాలు కొనుక్కొనే వీలు కల్పిస్తామని చెప్పారు.
Amaravati Telugu Latest News, Andhra Pradesh Telugu News


0 comments:

Post a Comment