Thursday 17 November 2016

అమరావతి రేషన్ షాపులో మినీ ఏటిఎం లు ప్రారంభం?

అమరావతి రేషన్ షాపులో మినీ ఏటిఎం లు ప్రారంభం?

amaravati images
అమరావతి: బ్లాక్  మనీ అరికట్టడానికి మోడీ ప్రవేశ పెట్టిన కొత్త నోట్ల వాళ్ళు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బంది ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరికట్టడానికి గ్రామగ్రామాన బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు కృషి చేస్తుంది,టెక్నాలజీ ని ఉపయోగించి డిజిటల్‌ లావాదేవీలు పెంచేందుకు రేషనషాపుల్లో మినీ ఏటీఎం యంత్రాలు ప్రవేశపెడుతున్నారు. రేషనడీలర్లనే బ్యాంకులు తమ వ్యాపార ప్రతినిధులుగా తీసుకుంటాయి. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించేందుకు ఈ పద్దతి ని  సాధ్యమైనన్ని ఎక్కువచోట్ల బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలోని 29 వేల రేషన షాపుల్లో ఈ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే సుముఖంగా ఉన్న రేషనడీలర్లను మాత్రమే ఈ లావాదేవీలకి తీసుకుంటారు. ఈపాస్‌ యంత్రాల్లో ఇప్పటికే కార్డు స్వైపింగ్‌ సదుపాయం ఉంది. నెలకు కనీసం 20రోజులపాటు రేషనషాపుల్లోని ఏటీఎంలు అందుబాటులో ఉండేలా నిబంధనలు పెట్టారు.ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాంకు వ్యాపార ప్రతినిధులయ్యే రేషనడీలర్లకు శిక్షణ, అవగాహన కోసం నెలరోజుల సమయం ఇస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టర్‌ చైర్మనగా, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ కన్వీనర్‌గా కమిటీలు వేస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షణీయమని రేషన డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలా మాధవరావు హర్షం వ్యక్తం చేశారు.
Amaravati Telugu News, Andhra Pradesh Today Telugu News.

0 comments:

Post a Comment