Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

Sunday 3 July 2016

తెలంగాణ ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్?

తెలంగాణ ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్?

chandrababu images

అమరావతి:  మాకు లేదా నోరు గొడవలు పడాలి అంటే ఒక్క క్షణం పట్టదు అని హితవు పలికాడు సీఎం చంద్రబాబు.స్నేహపూర్వకంగా కలిసి పరిష్కరించుకోవలసిన విషయాల్లో గొడవపడటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హైకోర్టు విభజన విషయంలో తెలంగాణలో అనవసర రాద్ధాంతం జరుగుతోందని తెలియచేశారు. అడ్డగోలుగా విభజన చేశారు. విభజన సమయంలో అన్నీ వదులుకున్నాం. హైకోర్టును వదులుకోవడం పెద్ద విషయమేం కాదు షెడ్యూలు పెట్టాలి అంటే ముడు నెలలు సరిపోతుంది. అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనాన్ని ఐకానిక్‌ నిర్మాణంగా చేపడుతున్నాం. దీనికి మాకు కొంత సమయం పడుతుంది అని తెలిపారు. చైనా, ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణతో నెలకొన్నకోర్టు వివాదాలపై సవివరంగా స్పందించారు. వివాదాల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీకి తాను నాలుగైదుసార్లు ప్రయత్నించానని. ఒకేవైపు అనుకుంటే చర్చలు జరగవని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా రెండు రాషా్ట్రల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా ఎటువంటి స్పందన రాలేదు.చర్చలకు ఎప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రడీ గానే ఉంటుంది అని తెలియచేశాడు. కేంద్రాన్ని కోరినా అక్కడి నుంచీ స్పందన లేదు. ఏదో ఒకటి అనడానికి గొడవ పెట్టుకోవడానికి ఒక్క నిమిషం పట్టదు. నాకు మాత్రం నోరు లేదా? అందరం సయోధ్యతో ముందుకు పోదామని చెబుతున్నా.కొత్త గా ఏర్పడిన రాష్ట్రం కష్టాలో ఉన్నాము అని అనుకుంటేనే పరిష్కారం అవుతుంది అని తెలియచేసారు. తెలంగాణ సీఎం కేసియర్ తో మాట్లాడటానికి నాకేం భేషజం లేదు. వారికి కావలసినవి అడుగుతున్నారు. చట్టంలో ఉన్నవాటిని మాత్రం కాదంటున్నారు. నేను ఇప్పటికి అయినా పరిష్కారానికి సిద్ధం. నేను వాళ్లకీ వీళ్లకీ భయపడుతున్నానని కొందరు మాట్లాడుతున్నారు. ఒకరికి భయపడం నా చరిత్ర లో లేదు . గొడవలు పడితే సాధించేదేమీ లేదు. అని చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలకూ స్వయంప్రతిపత్తి ఉంటుందన్నారు. ‘‘రాజకీయాలు వేరు. రాష్ట్రాలు వేరు. వారి వారి గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి’’ అని చంద్రబాబు తెలిపారు.
 ప్రజలూ ఆలోచించాలి :
‘‘రెండు రాష్ట్రాల్లో తెలుగువారున్నారు అందరి క్షేమము నాకు అవసరం తెలంగాణ ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు అని. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించింది తెలుగువారి ఆత్మగౌరవంకోసం అని తెలుగు వారు రెండు రాష్ట్రం లాగా విడి పోయిన మన కలిసి పనిచేసుకోవాలి అని హితుఁవ్ పలికారు . అందుకే నష్టమైనా, కష్టమైనా విభేదాల్లేకుండా ఉందామని చెబుతూ వస్తున్నాను. అదే సమయంలో నవ్యాంధ్ర ప్రజలు తమ హక్కులు కాపాడాలని మేము కష్టాలో ఉన్నాము అని మాకు  అభివృద్ధి కావాలి అని రాష్ట్ర బాధ్యతలు నాకు అప్పగించారు అని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.మనమంతా ఒక్కటే. తెలుగువారం. మీరు విభజన కావాలనుకున్నారు. అయిపోయింది. ఇంకా కొందరు రెచ్చగొడుతున్నారు వాళ్ళ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అడ్డుకోవద్దు అని. వివాదాలు పెట్టుకోవడం సరి కాదు అని విజ్ఞప్తి చేశారు.
విభజనలో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది. ఒకప్పుడు చెన్నై వెళ్లాం. అక్కడి నుంచి కర్నూలుకు వచ్చాం. తర్వాత హైదరాబాద్‌కు. ఇప్పుడు కట్టుబట్టలతోనే కాదు. అప్పులతో వచ్చాం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా దగ్గర డబ్బు లేదు.  ప్రభుత్వ  ఉద్యోగులకి జీతాలకూ డబ్బు  లేవు.రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నపుడు రైతు రుణమాపీ చేస్తామని మాట ఇచ్చాను? అనుకోకుండా అడ్డగోలుగా విభజన చేశారు అయిన ప్రజలకి ఇచ్చిన మాట కోసం కష్టం అయిన రైతులు ఆనందంగా ఉండాలి అని రుణ మాపి చేశాము.  మనకు రెండందాలా ఖర్చు! హైదరాబాద్‌లో ఆఫీసు నిర్మించుకున్నా. ఇక్కడికి వస్తూనే బస్సులో పడుకున్నా. అక్కడి నుంచి ఈ ఆఫీసు కట్టుకున్నా. మళ్లీ ఇప్పుడు అమరావతిలో కట్టుకుంటున్నాం. హైదరాబాద్‌లో ఆఫీసులకు డబ్బు కొంత అదనంగా కూడా ఖర్చవుతూ ఉంది. ఆఫీసు లేకుండా చెట్ల కింద మాట్లాడలేం కదా? ఎవర్నైనా పిలిచి చెట్ల కింద మాట్లాడితే రాను కూడా రారు. పెట్టుబడిదారులను ఆకర్షించలేం అని తెలిపారు.ఒక కుటుంబలో పెళ్లి చేయాలి అంటేనే అని విధాలుగా ఆలోచింది అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎలావుందీ మన అమ్మాయి ని ఇస్తే బాగుంటుందా అని ఆలోచించి చేస్తాము అలాంటిది మనం అనుకున్న అమరావతి ని నిర్మించాలి అంటే మనం కూడా పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి అని చెప్పారు.  
ఢిల్లీ ఏపీ భవనము పై ?
ఢిల్లీలోని ఏపీ భవన్‌ వివాదంపైనా సీఎం  చంద్రబాబు స్పందించారు. ‘‘ఢిల్లీలో ఉన్న నిజాం భవనాన్ని కేంద్రం తీసుకుంటే. నేను సీఎంగా అధికారం లో ఉన్నపుడు, వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు నేను మాట్లాడి దానికి బదులుగా ఏడెకరాల స్థలాన్ని ఢిల్లీ తీసుకున్నాం. అలాంటివి అనవసరంగా వివాదాస్పదం చేయడం సరికాదు. హైదరాబాద్‌ నా హయాంలోనే బాగా అభివృద్ధి చెందింది.నేను అనుకుంటే ఏది అయినా చేస్తా అని హైదరాబాద్ అందమైన నగరం గా మారడానికి నేనే కారణం అని  అది నా బ్రెయిన్‌ చైల్డ్‌’’ అని వ్యాఖ్యానించారు.
అవసరం ఐతే  కేంద్రమే పరిష్కరించాలి! 
విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారు. ‘‘అపెక్స్‌ సంస్థ, బోర్డులు ఉంటే సమావేశం జరపకుండా మీరు-మీరు పరిష్కరించుకోండంటే ఎలా అవుతుంది?’’ అని ప్రశ్నించారు. ఆస్తుల విషయంలో ఏకపక్ష వైఖరిని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని సిఎం గుర్తు చేశారు. ఉన్నత విద్యా మండలి కేసులో ఇచ్చిన తీర్పు అమలుకోసం తాను ప్రయత్నించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం స్పందించలేదని ఆక్షేపించారు.చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి అని మన తెలుగు ప్రజలు అని ఒక్కటిగా ఉండాలి అని  ‘‘ప్రాథమిక దశలో ఉన్న రాషా్ట్రనికి కేంద్ర సాయం అవసరం. పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కూడా అవసరం. అదే సమయంలో ప్రజల ప్రయోజనాలు కాపాడకపోతే విశ్వాసం కోల్పోతాం. ఈ రెండు సమన్వయం చేసుకుంటూ పోవాలి’’ అని చంద్రబాబు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవను కేంద్రం రాజేస్తోందని తాను అనుకోవడంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు. 
ఇందుకే హైకోర్టు ఆలస్యం!
‘‘పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని చెప్పారు. అయినా అక్కడే ఉండలేదు కదా! అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు వదులుకుంటే ఏమవుతుందండీ అని కెటియర్ చేసిన వ్యాఖ్యలని సమాధానము చెప్పారు! హైకోర్టు ఒక ఐకానిక్‌ బిల్డింగ్‌గా ఉండాలనుకున్నందుకే ఆలస్యం జరుగుతోంది. ఏదో ఒక షెడ్డు వేయాలనుకుంటే మూడు నెలల్లో అయిపోతుంది అమరావతి ఒక అందమైన నగరం గా తీర్చి దిద్దాలి’’ అని చంద్రబాబు తెలిపారు. రైతులు భూములు ఇచ్చిన తర్వాతే రాజధాని వచ్చిందని. ఏది ఎక్కడ రావాలో నిర్ణయించేందుకు సమయం పడుతుందని చెప్పారు.ఒకసారి తప్పు చేశాము మళ్ళీ తప్పు జారకూడదు అని ఆంధ్రప్రదేశ్ లో ఉండే 13 జిల్లా లని అభివృధి చేసే భాద్యత నాడే అని చెప్పారు  ఏపీలో హైకోర్టు కట్టుకున్న తర్వాత తరలిస్తే. ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణకు వస్తుందని విభజన చట్టంలో చెప్పారని గుర్తు చేశారు మాకు చట్టం పై నమ్మకం ఉంది అని తెలియచేసారు.‘‘గొడవలు పెట్టుకోవాలని నాకు లేదు. ఏవైనా సామరస్యంగా కూర్చొని  పరిష్కరించుకోవాలి. చట్టం అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది తప్ప, తమకు అనుకూలంగా ఉన్నది మాత్రమే చెయ్యాలనడం కరెక్టు కాదు. కలసి మాట్లాడుకుందామని నేను మొదటి నుంచీ చెబుతున్నాను. మనతో కానప్పుడు ఢిల్లీ పెద్దలను పరిష్కారం చేయమందాం’’ అని చంద్రబాబు తెలంగాణకు సూచించారు. సామరస్యంగా పరిష్కారం చేసుకోకుండా గొడవలు పడితే ఎవరికీ లాభం లేదని సీఎం వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రజలకి ఎటువంటి  అన్వయం చేయము అని తెల్;ఇయచేశారు .

Amaravati Telugu News Updates, Online Telugu News Updates, AP News, TS News, Today Telugu News, Telugu Latest News,Chandra Babu News.

Saturday 2 July 2016

"ఓం నమో వెంకటేశాయ" మొదటి అడుగు!

"ఓం నమో వెంకటేశాయ" మొదటి అడుగు! 

Nagarjuna Images
హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దైవ చిత్రం అంటేనే ముందుగా గుర్తు ఉండేది అక్కినేని నాగార్జున. దైవ చిత్రం తో మళ్ళీ మన ముందు కి శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడైన హాథీరాం బాబా జీవిత కథ ఆధారంగా అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’.నాగార్జున అంటే నే దైవ సంభూతుడూ అని చెపుకోవచ్చు అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడి సాయిబాబు వంటి గొప్ప సినిమా లు తీసిన నాగార్జున ఈ చిత్రం మంచి అనుభవం యిస్తుంది అనుకుంటున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శనివారం మొదలైంది. చిత్రీకరణకు సంబంధిచిన మొదటి  ఫోటో ఒకటి నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో ఈరోజు ఉదయం షూటింగ్‌ ప్రారంభమైందని, ఈ అనుభవం చాలా బాగుందన్నారు.దైవ చిత్రం తీయడం ఎంతో అదృష్టం అని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.మహేశ్వరరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున హాథీరాం బాబాగా నటిస్తుండగా..ప్రగ్యాజైస్వాల్, అనుష్క కీలక పాత్రలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న నాలుగో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.త్వరలో  మీ ముందుకు వస్తుంది అని తెలియచేశారు . 

Amaravati Telugu News Updates, Movie Telugu News, Movie Latest Updates, Telugu News Updates.

Thursday 30 June 2016

నా తలరాత మారదా !

నా తలరాత మారదా !

Jagan Images
ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి  అవినీతి ఆస్తులు తో క్రితం జైలు కి కూడా వెళ్లిన విషయం అందరికి తెలిసిందే మళ్ళీ అదే స్థితి ఏర్పడింది. జగన్  అక్రమ ఆస్తులు దాదాపు రూ. 750 కోెట్ల లను ఈడీ అటాచ్ చేయడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు,జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది.తన పార్టీ నుంచి విడి పోయిన యం. ఎల్. ఎ లలను కాపాడుకోడంలో విఫలం అయ్యాడు ఏమి అర్థం కాక తన భవిష్యత్‌ను తెలుసుకునేందుకు తన జీవితం ఎలా ఉంటుందో అని భయంతో జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నట్లు తెలియవచ్చింది. తన పర్యటన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని లోటస్‌పాండ్‌.. తన నివాసానికి జ్యోతిష్యులను పిలిపించుకుని మాట్లాడినట్లు సమాచారం. అలాగే న్యాయ సలహాదారులతో మంతనాలు జరిపినట్లుగా తెలియవచ్చింది. అనంతరం కొంతమంది మత పెద్దలతో కూడా జగన్ భేటీ అయినట్లు తెలియవచ్చింది. 
అనూహ్యంగా నిన్న జరిగిన పరిణామాలు జగన్‌ను షాక్‌కు గురిచేశాయి. అందులో భాగంగానే ఈరోజు జ్యోతిష్యు‌లను ఆయన లోటస్‌ పాండ్‌కు పిలిపించుకుని వారితో గంటకుపైగా భేటీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ అధికారులు గురువారం సాయంత్రం లోటస్‌పాండ్‌కు చేరుకుని నిన్న అటాచ్ చేసిన రూ. 750 కోట్ల ఆస్తులకు సంబంధించిన నోటీసులు జగన్‌కు అందజేసినట్లుగా సమాచారం.జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో మరి వేచి చూడాలి.

Amaravati Telugu News Updates, Telugu News Updates, Jagan Telugu News, APNews.

Wednesday 29 June 2016

మళ్ళీ చేదు వార్త ఫ్రీడమ్ 251 !

మళ్ళీ చేదు వార్త ఫ్రీడమ్ 251 !

freedom mobile images
తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అని గత కొని నెలల క్రితం హడావిడి చేసిన రింగింగ్‌బెల్స్‌ కొని కారణాల వల్ల నిలిపివేశారు. మళ్ళీ 251కే స్మార్ట్‌ఫోన్‌ అంటూ.. ఫోన్ లవర్స్ ను ఊరించిన ఫ్రీడం ఫోన్ల పంపిణీ మరోసారి వాయిదా పడింది. అనేక వివాదాల నేపథ్యంలో ఈ స్మార్ట ఫోన్ ఇప్పటివరకు వినియోగదారుల చేతికి రాలేదు. జూన్ 30నుంచి పంపిణీకి సర్వం సిద్ధమని చెప్పిన రింగింగ్ బెల్స్ మరోసారి నిరాశ పర్చింది. ఫోన్ల డెలివరీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది అని ఇప్పటికే యూజర్స్ నిరుత్సహం గా ఉన్నారు అని. మరోసారి వాయిదా వేసి జులై 7నుంచి ఫోన్లు డెలివరీ చేయనున్నట్లు రింగింగ్‌బెల్స్‌ ప్రకటించింది.
బ్యాటరీ సమస్యల వల్ల డెలివరీ ఆలస్యమైందని రింగింగ్‌బెల్స్‌ సీఈవో, వ్యవస్థాపకుడు మోహిత్‌ గోయల్‌ వివరణ ఇచ్చారు. జులై 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. జులై 7న ఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసి.. డెలివరీని ప్రారంభిస్తామని గోయల్ తెలిపారు. అంతేగాక.. అమ్మకాలు ప్రారంభించే ముందుగా ప్రధాని నరేంద్రమోదీని కలిసి తమ ఫోన్లకు మద్దతివ్వాల్సిందిగా కోరనున్నట్లు మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా తమకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరనున్నామని... ప్రధానితో సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను పంపామని గోయల్ తెలిపారు.
రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రావడంతో లక్కీ డ్రా పద్ధతి ద్వారా కొనుగోలు దారులను ఎంపికచేయనున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో జూన్‌ 30 నుంచి జులై 5 వరకు లక్కీ డ్రా నిర్వహించి.. ఫ్రీడం ఫోన్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌ నుంచే.. అత్యధికంగా 2కోట్ల రిజిస్ట్రేషన్లు రాగా.. ఆ రాష్ట్రానికి 10వేల ఫోన్లను కేటాయించినట్లు తెలిపారు.
కాగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ అందిస్తామని నోయిడాకు చెందిన రింగింగ్‌బెల్స్‌ సంస్థ ప్రకటించింది. విషయం తెలిసిందే. ఫ్రీడమ్‌ 251 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్లపై అప్పట్లో పెద్ద దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. 

Freedom Mobile Updates, Freedom Mobile Images, Telugu News Updates,Telugu News.

కబాలి మళ్ళీ వాయుదా!

కబాలి మళ్ళీ వాయుదా! 

kabli images
సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్ టీజర్స్‌తో మంచి  అంచనాలు పెట్టుకున్న రజనీ అభిమానులకు మరో చేదువార్త ఎదురుఅవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలలో పలుమార్లు జాప్యం జరగగా మరోసారి వాయిదా పడిందని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఇటీవలే పాటలు విడుదల చేసిన చిత్రయూనిట్ ‘కబాలి’ చిత్రాన్ని జులై 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం జులై 22కి వాయిదా వేసినట్లు తెలిసింది. త‌మిళ యువ ద‌ర్శ‌కుడు పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చగా.. కలైపులి ఎస్‌.థను నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రజనీ సరసన రాధిక ఆప్టే నటిచింది. ఇందులో క‌బాలీశ్వ‌ర‌న్ అనే డాన్ పాత్ర‌ను రజనీ పోషించినట్లు సమాచారం.

Kabali Telugu Movie Updates, Telugu Movie News, Rajinikanth Movie Images.

Tuesday 28 June 2016

హైదరాబాద్ అంత కాళీ కాళీ!

హైదరాబాద్ అంత కాళీ కాళీ!

hyderbad offfice images
హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలు అభివ్రుది కోసం పాటుపడుతున్నాయి కానీ ఇప్పుడే కోలుకోలేదు అనుకున్న ప్రజలు?  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు తన సత్తా ఏంటో చూపించాడు అని చెపుకోవచ్చు హైదరాబాద్ నుంచే పరిపాలిస్తుంటే అభివ్రుది ఉండదూ అని బాబు గారు ఆలోచించి ఒక అడుగు ముందుకి వేశారు  నవ్యాంధ్ర రాజధాని  లో ఈ నెల లో పలు కార్యాలయాలు ఏర్పాటు చేశారు ఏకంగా సోమవారం రాజధాని  ప్రాంతంలో 15 కార్యాలయాల ప్రారంభోత్సవంతో సందడి వాతావరణం నెలకొనగా.చెపుకోవచ్చు మరోవైపు హైదరాబాద్‌లోని పలు హెచ్‌వోడీ ఆఫీసులు వెలవెలబోయాయి. పూర్తిస్థాయిలో తరలివెళ్లని ఉద్యోగులు కూడా వారు చేరబోయే కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం తరలివెళ్లారు. దీంతో హైదరాబాద్‌లో పలు కార్యాలయాలు బోసిపోయాయి. ఎర్రమంజిల్‌లో ఉన్న పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌-ఇన-చీఫ్ కార్యాలయం, గ్రామీణ నీటి సరఫరా సీఈ కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి.
ఈఎన్‌సీ కార్యాలయంలోని 4, 5, 6వ అంతస్తుల్లో ఆఫీసు కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులు విజయవాడకు తరలివెళ్లారు. ఒక్కరో, ఇద్దరో జూనియర్‌ ఉద్యోగులు కొన్ని కార్యాలయాల్లో కనిపించినా.. ఎక్కువ గదులకు తాళాలు వేశారు. ఎప్పుడూ వాహనాలతో కిక్కిరిసి ఉండే ఈఎన్‌సీ కార్యాలయంలో పార్కింగ్‌ కూడా ఖాళీగా కనిపించింది. హిమాయతనగర్‌లో ఉన్న పంచాయతీరాజ్‌శాఖలో కూడా ఉద్యోగులెవరూ లేకపోవడంతో బోసిబోయింది. తెలంగాణ కార్యాలయాలు బోసిపోయినట్లు నాంపల్లిలోని హెర్మిటేజ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న మూడు ఫ్లోర్లలో జనసంచారమే లేదు. సెర్ప్‌ కార్యాలయంలో అయితే ఏపీ ఉద్యోగులతో పాటు ఫైళ్లు కూడా తరలివెళ్లాయి. ఇక... మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవనలో ఉన్న ఏపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్యాలయాలన్నీ తరలి వెళ్లాయి. ఆదివారమే సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయవాడలో సాంఘిక సంక్షేమ కార్యాలయాలను ప్రారంభించారు. ఇక తరలింపులో ముందు వరుసలో ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీలో లీగల్‌, ఎస్‌ఆర్‌బీసీ, ఎస్బీటీ వంటి విభాగాలు మాత్రమే బస్‌భవనలో మిగిలాయి. దీంతో, తెలంగాణ సిబ్బంది తక్కువగా ఉండటంతో బస్‌భవన బోసిపోయి కనిపించింది.
భవనాలు, స్పష్టత కోసం ఎదురుచూపులు 
పరిశ్రమలశాఖ కమిషనరేట్‌ విజయవాడలోని గొల్లపూడిలో ప్రారంభించాలనుకున్నా ఇంకా ఖరారు కాలేదు. దీనిపై స్పష్టత వచ్చాకే హైదరాబాద్‌ నుంచి తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఇరిగేషన ఈఎన్‌సీ కార్యాలయాల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. విజయవాడ భవానీపురంలో దీన్ని ఏర్పాటుకు తీసుకున్న భవనాలకు మరమ్మతులకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉండడమే జాప్యానికి కారణం. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి వెళ్లేందుకు మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌ ఉద్యోగులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో డైరెక్టరేట్‌ కార్యాలయానికి భవనం చూసుకున్నా... తరలింపునకు ఎలాంటి ఉత్తర్వులూ అందలేదు. ట్రైనింగ్‌ కోసం ఆ శాఖ కమిషనర్‌ చక్రవర్తి ముస్సోరి వెళ్లడంతో రాజధానికి తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది.
వాణిజ్యపన్నుల కమిషనరేట్‌లో కంప్యూటర్‌ సెక్షన, లీగల్‌ సెక్షన మినహా అన్నీ విజయవాడకు తరలివెళ్లాయి. స్కెలిటన్‌ స్టాఫ్‌తో ఏపీ సచివాలయంలో అన్ని శాఖలకు సంబంధించి ఒక న్యాయ విభాగం ఏర్పాటు చేసేవరకూ వాణిజ్యపన్నుల శాఖ భవనంలోనే లీగల్‌సెల్‌ను కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఇక... విద్యుత సంబంధిత కార్యాలయాలు 9, 10వ షెడ్యూల్‌లో ఉన్నందున ఇప్పుడే తరలివెళ్లొద్దని సీఎస్‌ ఎస్పీ టక్కర్‌ ఆ శాఖలకు సూచించారు. చేనేత జౌలిశాఖ అధికారులు ఇప్పటికే మంగళగిరి చేరుకోగా.. తొమ్మిది, పది షెడ్యూల్లోని సంస్థల్లో ఒకటైన ఆప్కో ప్రధాన కార్యాలయ సిబ్బంది కొందరు హైదరాబాద్‌లోనే ఉన్నారు.
పూజకు నోచుకోని అరణ్యభవన్‌! 
పలు శాఖలు ప్రారంభోత్సవాలతో సోమవారం బిజీగా ఉంటే... అరణ్యభవన్‌కు మాత్రం వింత పరిస్థితి ఎదురైంది. అన్ని శాఖలతోపాటే తరలి వెళ్లేందుకు ఉండవల్లి ప్రాంతంలోని ఎస్వీఆర్‌ టవర్స్‌లో అధికారులు ఓ భవనం చూసుకున్నారు. సోమవారం దీన్ని ప్రారంభించేందుకూ సిద్ధమయ్యారు. కానీ, కార్యాలయ బోర్డు ఏర్పాటు చేయడానికి భవనం యజమాని ఒప్పుకోలేదు. దీంతోపాటు మరికొన్ని షరతులు కూడా పెట్టడంతో ప్రారంభోవత్సరం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో పూజ, ప్రారంభోవత్సరం చేయకుండానే పీసీసీఎఫ్‌ ఎస్‌బీఎల్‌ మిశ్రా, ఇతర ఐఎఫ్‌ఎస్ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Amaravati Tleugu News Updates, Telugu News Updates, Online Telugu News Updates, APNews, TS News, Telugu Breaking News, Telugu Today News.


అఖిల్ కూడా ప్రేమ బాటలో !

అఖిల్ కూడా ప్రేమ బాటలో !

Akhil Love Images

హైదరాబాద్: ఇటీవలే యాక్టర్  చైతూ, సమంతల  ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని మీడియా వర్గాలు  ఇటీవల బహిర్గతమైన  సంగతి తెలిసిందే. దాంతో తనకు లైన్ క్లియర్ అయిందనుకున్నాడో ఏమో గానీ  తన సోదరుడు అఖిల్ కూడా తన  ప్రేయసితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడట. ఈ విషయం వాళ్ళ  ఇరు కుటుంబీకులకి తెలిసింది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల చైతూ ప్రేమకథలో విలన్ ట్రాక్ అవసరమే లేకుండా పోయింది. అఖిల్ ప్రేమిస్తున్న ప్రేయసి హైదరాబాద్ నగరంలోని ఓ వ్యాపార వేత్త కుమార్తె అయిన శ్రేయ భూపాల్‌‌తోనట. న్యూయార్క్‌లో చదువుకున్న అమ్మడు  డిజైనర్ గా  పనిచేస్తున్నారు. మొత్తానికి అఖిల్ లవ్ స్టోరీ ఎలాంటి ట్విస్ట్ లేకుండానే సుఖాంతమవనుంది అని చెపుకోవచ్చు ఇదిలా ఉంటే చైతూ, సమంతలు కూడా త్వరలో ముసుగులు తొలగించి అందరిమధ్యా ఒక్కటవ్వనున్నారట అని మీడియా వర్గాలు చెబుతున్నారు  వీరి ప్రేమకు కుటుంబం నుండి ఫుల్ సపోర్ట్ ఉందిట. తెలియవస్తున్న సమాచారం ప్రకారం నాగచైతన్య నటిస్తోన్న ‘ప్రేమమ్’ సినిమా పూర్తవగానే నిశ్చితార్థ వేడుక జరుగనుందిట. ఈలోపు అఖిల్ కూడా ఉంగరాలకు ఆర్డరిచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.ఎంత అయిన అన్న కంటే ముందే తమ్ముడు ఉన్నాడు అని చెపుకోవచ్చు . 

Monday 27 June 2016

ఏపీకి నీటి గండం?

ఏపీకి నీటి గండం?

ఆంధ్రప్రదేశ్ లో ఏడ తెరువు లేని వర్షాలు పడుతున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాను ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.తెలంగాణ, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపారు. కోస్తా తీర ప్రాంతవాసులు జాగ్రత్తగా ఉండాలి సూచించారు.

చిరుతో బాలీవుడ్ యాక్టర్ నటిస్తుందా!

చిరుతో బాలీవుడ్ యాక్టర్ నటిస్తుందా!

హైదరాబాద్:  చిరు 150వ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి హీరోయిన్ విషయంలో ఎవరో తేల్చ లేక పోతున్నారు కానీ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది అనుకోవచ్చు  దాదాపు 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయి హీరోగారీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కత్తిలాంటోడు  ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన సంగతి అందరకి  తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో చిరు సరసన నటించేందుకు ఎవర్ని ఎంపిక  చేయక పోవడం మెగాఫ్యాన్స్‌ను ఇన్నాళ్లూ సస్పెన్స్‌కు గురిచేసింది. రీసెంట్‌గా ఈ చిత్రంలో చిరుతో జోడీ కట్టేందుకు బాలీవుడ్ ఐటమ్ భామ నర్గీస్ ఫక్రీని ఖరారు చేశారని సమాచారం. బాలీవుడ్‌లో హాట్‌ సెక్సీ బాంబ్‌గా పేరు తెచ్చుకున్న నర్గీస్ తెలుగులోనూ పలు సినిమాల్లో ఐటమ్ భామగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు చిరు సినిమా కోసం త్వరలో చిరంజీవితో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొనుందట. ఆ షూట్‌లో ఇద్దరి జోడీని చూసిన తర్వాత ఆమెను హీరోయిన్‌గా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే..చిరంజీవి 150వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మెగా ఫ్యామిలీ మూవీగా రూపొందుతోంది. ఇప్పటికే తండ్రి సినిమాతో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి రామ్ చరణ్ నిర్మాతగా మారగా..చిరు తనయ సుస్మిత ఈ చిత్రానికి చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తోందట. ఇటీవలే షూటింగ్ ప్రారంభించి ఈ సినిమా సెట్స్‌‌లో చిరంజీవి పెద్ద కూతురు కూడా కనిపించింది. తండ్రి రీఎంట్రీ సినిమా కనుక సరదాగా సెట్స్‌లో సందడి చేసుకున్నారంతా. కానీ చిరుకి కాస్ట్యూమ్ డిజైనర్ మెగా డాటర్ ఈ సినిమాకు వర్క్ చేస్తోందట. గతంలో చిరు నటించిన శంకర్‌దాదా జిందాబాద్ సినిమాకు కూడా కాస్ట్యూమ్స్ అండ్ స్టైలింగ్‌ను సుస్మిత పర్యవేక్షించింది. అలాగే ఈ మెగామూవీలో సాయిధరమ్, తేజ్, వరుణ్ తేజ్‌లు నటించే అవకాశం ఉందని సమాచారం.ఇంకా మెగా ఫ్యాన్స్ కి పండగే పండగా అంటున్నారు సినిమా ప్రొడెక్షన్ . 

Sunday 26 June 2016

జ్ఞానసాయికి కాలేయ మార్పిడి కి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాటు!

జ్ఞానసాయికి కాలేయ మార్పిడి కి  ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాటు!

Gaana Sai images
అమరావతి:  చిత్తూరు జిల్లా కి చెందిన రమణప్ప కూతురు అయినా చిన్నారి  కాలేయ వ్యాధితో బాధపడుతున్న జ్ఞానసాయికి చెన్నైలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిరుపేద కుటుంబానికి చెందిన జ్ఞానసాయి తల్లిదండ్రులు పాపకు చికిత్స చేయించలేక పడుతున్న మనోవేదన చుసిన మీడియా ఈ విషయం ని వెలుగులోకి తీసుకొచ్చారు మరియు రాష్ట్ర ప్రభుత్వం దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు పాప చికిత్స బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందని ప్రకటించారు. చిన్నారి వైద్య సేవల బాధ్యతను ఆరోగ్యశాఖ కార్యదర్శికి అప్పగించారు. దీంతో ఆయన శనివారం జ్ఞానసాయికి హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు హైదరాబాద్‌లో వీలులేకపోవడంతో వైద్యులు చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. సోమవారం అక్కడకు రావాలని అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. రెండు రోజుల గడువు ఉన్నందున శనివారం మధ్యాహ్నం పాప తల్లిదండ్రులు రమణప్ప, సరస్వతి తమ బిడ్డను తీసుకుని స్వగ్రామమైన చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలోని ఆర్‌ఎస్‌ కొత్తపల్లెకు వచ్చారు. ఆదివారం రాత్రి చెన్నైకు బయలుదేరి వెళ్తామని రమణప్ప తెలిపారు. కాగా, చిన్నారికి తల్లి లేదా తండ్రి కాలేయాన్ని అమర్చనున్నారు. కాలేయం ఇచ్చిన వారికి తర్వాత కాలేయం పెరుగుతుందని వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. ఐదు నుంచి పదేళ్ల వరకు పాప, కాలేయం ఇచ్చిన వ్యక్తీ మందులు వాడాల్సి ఉంటుందని వైద్యులు వివరించినట్లు చెప్పారు.
నేను ఉన్న పాపకి !
సీఎం చంద్రబాబు శనివారం రాత్రి జ్ఞానసాయి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. చైనా పర్యటనకు వెళ్లేందుకు ఢిల్లీ చేరుకొన్న సీఎం ఢిల్లీ విమానాశ్రయం లాంజ్‌ నుంచే పాప తల్లితండ్రులకు ఫోన్‌ చేశారు. చిన్నారికి ఆపరేషన్‌, వైద్యసేవలపై ఆరా తీశారు. పాపకు పూర్తిస్థాయిలో వైద్యం చేయించే బాధ్యత తమదేనని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. చిన్నారి ఆపరేషన్‌ ఖర్చుతోపాటు, ఆపరేషన్‌ అనంతరం వాడాల్సిన మందులకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం, పాప యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. కాగా, తమ బిడ్డ జ్ఞానసాయి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు పెద్ద మనసుతో సాయమందించిన సీఎం చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటామని పాప తల్లిదండ్రులు రమణప్ప, సరస్వతి తెలిపారు. ఆయన స్పందించకుంటే తమ బిడ్డ దక్కేది కాదన్నారు.
ఎమ్మెల్యే సాయం రూ.25 వేలు
జ్ఞానసాయి కాలేయ మార్పిడికి సహకరించాలని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఇచ్చిన పిలుపునకు దాతలు పెద్దఎత్తున స్పందించారు. శుక్రవారం సాయంత్రానికి జ్ఞానసాయి తల్లి సరస్వతి బ్యాంకు ఖాతాలో రూ.5,01,756 జమ అయ్యాయి. కాగా, ఆస్పత్రికి వెళ్లేందుకు ఖర్చుల కోసం 25 వేలు ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే శంకర్‌ అందించారు. చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వస్తుందని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.తన పాప ఆప్రషన్ కి సహాయం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు మా జీవితం అంత మీకు రుణపడి ఉంటాము అని తెలియచేశారు . 

అదరహో అన్న క్యాంటీన్ !

అదరహో అన్న క్యాంటీన్ !

anna canten images

అమరావతి:  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో  సంక్షేమం పథకాలు తో , అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం, అసలు ఆ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏ మాత్రం ప్రజలుకి చేరుతున్నాయో అని ప్రభుత్వం సర్వే మొదలు పెట్టింది, రాష్ట్రా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏ మేరకు అమలవుతున్నాయో ఆరా తీయాలనుకొంది. అధికారులను పురమాయించడం, వారిచ్చిన నివేదికలను పరిశీలించడం, ఏదోఒక అంచనాకు రావడం కాకుండా.. నేరుగా లబ్ధిదారులనే అంటే ప్రజలనే  పలకరించింది. అదీ మొక్కుబడిగానో, ఏదో మోస్తారుగానో కాదు.. భారీ ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ కి రాష్ట్ర ప్రభుత్వం  జరిపించింది. ప్రభుత్వ స్కీంలపై ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకొనే పనిని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులకు అప్పగించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సంస్థ అధికారులు.. పట్టణ లబ్ధిదారులపై దృష్టి పెట్టారు. సంస్థ కాల్‌ సెంటర్‌ల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. శాంపిల్‌ సర్వేలు, ఎగ్జిట్‌ పోల్‌లను తల దన్నేలా.. ఏకంగా 1.30 లక్షల మందికి ‘కాల్‌’ చేసి వివరాలు సేకరించారు. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వానికి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా, నెలవారీ చెల్లించే వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు, పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, శిక్షణ, ప్రైవేటు పారిశ్రామిక సంస్థలలో ప్లేస్‌మెంట్‌, చంద్రన్నబీమా తదితర పథకాలు, కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రజల మనోగతాన్ని నమోదు చేశారు.
అన్ని జిల్లా ల సేకరణ:
అనంతపురం మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఒక్కో జిల్లాలోని పట్టణ, నగర ప్రజలను పలకరించారు. 1,29,181 మందిని సంప్రదించగా, 70,983 మంది, అంటే 55 శాతం స్పందించారు. సెల్‌ఫోన్‌ నంబర్లు మార్పిడి తదితర కారణాలతో 58,198 మంది కాల్‌కు స్పందించలేదు. ఇందులో పింఛన్లపై 20 వేల కాల్స్‌ చేయగా, సగం మందికి పై గా  స్పందించారు. ఉపాధి శిక్షణపై 20 వేల కాల్స్‌, ఉపాధి ప్లేస్‌మెంట్‌పై మూడు వేలు, యూనిట్లపై 81 వేలు, చంద్రన్న బీమాపై నాలుగు వేల కాల్స్‌ చేయగా వరసగా 12 వేల మంది, 1,500 మంది, 44 వేలమంది, 2వేల మంది స్పందించారు. ‘హలో’ అనగానే ‘మేం బాగున్నాం. చంద్రబాబు పథకాలూ బాగున్నాయి’ అన్న సమాధానమే అత్యధికుల నుంచి వచ్చింది.ఈ సర్వే లో బాబుగారికి మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెపుకోవచ్చు . 
విశాఖ ఫస్ట్‌:
నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాలకు విశాఖ జై కొట్టింది. మొత్తం 891 కాల్స్‌ చేయగా, శిక్షణ బాగా అందుతున్నదని 132 మంది చెప్పగా, 575 మంది సంతృప్తి ప్రకటించారు. కేవలం పదిమంది మాత్రమే శిక్షణ తీరుపై విముఖత చూపారు. ఆ తరువాత స్థానంలో నిలిచిన నెల్లూరులో 630 మంది స్పందించగా, 89 మంది బహు సంతృప్తిని, 430 మంది సంతృప్తి కనపరచగా, కేవలం నలుగురు పెదవి విరిశారు. మిగతా జిల్లాల్లో శిక్షణపై దాదాపు ఇలాంటి స్పందనలే నమోదయ్యాయి. ఉపాధి ప్లేస్‌మెంట్‌ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల కాల్స్‌ వెళ్లాయి. 
పింఛన్లకు ‘కడప’ ఓటు:
1000/- పింఛన్ పథకానికి ఏర్పాటు చేసిన టీడీపీ ప్రభుత్వం కడప ప్రజల నుంచి  గట్టిగా నే మంచి రెస్పాన్స్ వచ్చింది . కడప జిల్లాలో 1,105 కాల్స్‌కుగాను, సగానికి పైగానే ‘సంతృప్తి’కర స్పందనలు వినిపించాయి. 138 మంది స్కీంలపై బహు సంతృప్తిని, 574 మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ స్థాయి స్పందన తిరిగి విజయనగరం జిల్లాలో నమోదయింది. ఈ జిల్లాలో 1,017 మందికి కాల్స్‌ వెళ్లగా, దాదాపు అరవైశాతం మంది ‘మంచి’గా స్పందించారు. బహు సంతృప్తిని 128 మంది, సంతృప్తిని 503 మంది ప్రకటించగా, 227 మంది ఫరవాలేదని, 39 మంది బాగాలేదని అభిప్రాయపడ్డారు. ఇలా.. చిత్తూరుకు 558 కాల్స్‌, తూర్పుగోదావరి జిల్లాకు 108, గుంటూరుకు 341, కృష్ణాకు 493, కర్నూలుకు 460, నెల్లూరుకు 594, ప్రకాశానికి 583, శ్రీకాకుళానికి 48, విశాఖకు 317, పశ్చిమగోదావరి జిల్లాకు 198 కాల్స్‌ వెళ్లాయి.
ప్రజల  అభిప్రాయాలు :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అన్ని బాగానే అమలుఅవుతున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినా సర్వే లో వెల్లడి అయింది . కానీ ఇంకా కొని గ్రామంలో ఈ పథకాలు అందంలేదు అని ప్రజలు అంటున్నారు . ఏ రాష్ట్రంలో లో అయినా బీద వారు ఉండేది గ్రామంలో అని ఏ పథకం అయినా అక్కడి నుంచే ఏర్పాటు అయితే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది అని ప్రజల భావిస్తున్నారు. కొత్త గా పెట్టిన అన్న క్యాంటీన్ పథకం కూడా వీలు ఈ\అయినా అంత త్వరగా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తే టిడిపి కి తిరుగు లేదు అని ఎందుకు అంటే పుట గడవని కుటుంబం కూడా ఉన్నారు వాళ్లకి చాలా ఉపయెగపడుతుంది అని ప్రజలు భావిస్తున్నారు. 

Friday 24 June 2016

చిన్నారి ప్రాణానికి అండగా నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబు!

చిన్నారి ప్రాణానికి అండగా నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబు!

babu images
 బిడ్డను చంపుకొంటాం.. అనుమతివ్వండని కోర్టును ఆశ్రయించిన జ్ఞానసాయి తల్లిదండ్రుల స్థితిని చూసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. కాలెయ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు రూ.30 లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. చికిత్స కూడా హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో జరిగేలా అధికారులను ఆయన ఆదేశించారు. జ్ఞానసాయితో పాటు చిన్నారి తల్లిదండ్రులకు కూడా మెరుగైన చికిత్సను అందించాలని ఆయన ఆదేశించారు. వెంటనే చికిత్స ప్రారంభించి చిన్నారి ప్రాణాలని కాపాడాలని సీఎం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.చంద్రబాబు గారు తన మంచి హృదయం తో సహాయం చేసినందుకు  ధన్యవాదం తెలుపుతున్నాము . దయచేసి మీకు తగినంత హెల్ప్ చేయాలి అని bestencouragement వెబ్సైట్  నుంచి కోరుతున్న దయ ఉంచి హెల్ప్ చేయండి ఆ దేవుడు పాప కి ఎటువంటి కష్టం రాకుండా చేస్తారు . 
ఎవరు అయిన సహాయం చేయాలి అనుకుంటే ఈ అకౌంట్ నంబర్ కి డబ్బు ని ట్రాన్స్ఫర్ చేయండి 
అకౌంట్ నంబర్ : 6182050732.
IFSC CODE : IDIB000M044.

ఉద్యోగులకు ఆహ్వానం పలికిన అమరావతి ప్రజలు !

ఉద్యోగులకు ఆహ్వానం పలికిన అమరావతి ప్రజలు !

amaravati employes images

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి పోయిన తరువాత ఆ రాష్ట్రం చాలా కష్టాలో ఉంది వాటిన్నిటిని అధిగమించడానికి  సీఎం చంద్రబాబు సర్వ ప్రయతన్నలు చేస్తున్నారు. దాని కోసం బాబు గారు తెలంగాణ లో పనిచేసే ఏపీ ఉద్యోగులు అందరిని అమరావతికి రాపించారు గుంటూరు పాత మార్కెట్‌ యార్డు ప్రాంతంలోని చుట్టుగుంట సెంటర్‌లో గురువారం రాత్రి పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన మూడు ప్రత్యేక బస్సుల్లో వ్యవసాయ శాఖ అధికారులకి , ఉద్యోగులకు ఘన స్వాగతం దక్కింనంది . ఈ ఉద్యోగులు వస్తున్నారని తెలిసి ఆ ప్రాంతంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగుల అసోసియేషన్‌, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్లు స్వాగతాలతో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విభజన తరువాత అమరావతి  వస్తున్న అధికారులుని, ఉద్యోగులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముందుకు వచ్చారు. వ్యవసాయ శాఖ జేడీ కృపాదాస్‌, డీడీలు రామలింగయ్య, గుడిపూడి వెంకటేశ్వర్లు, ఏడీ నున్నా వెంకటేశ్వరరావు, ఎవోలు మోహనరావు, అమలకుమారి, అంకమ్మరావు, పూర్ణ చంద్రరావు, హనుమంతరావులు రెండు రోజల నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్ల అసోసియేషన్‌కు చెందిన ఎంవిఎస్‌ శ్రీనివాసరావు, కె.కాశీవిశ్వేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, మాము పుష్పగుచ్ఛాలు అందజేసి స్వీట్లు అందజేశారు. విభజన తరువాత గుంటూరులో పని చేయడానికి మనస్ఫూర్తిగా వచ్చిన అధికార యంత్రాంగానికి అండగా ఉంటామని డీలర్లు, స్థానిక అధికారులు, ఉద్యోగులు హామీ ఇచ్చారు.
ఇక అమరావతి  నుంచే సేవలు :
విభజన తరువాత రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లో నుంచే కొనసాగిన ఉన్న వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ గుంటూరుకు తరలింది. గుంటూరు కేంద్రంగానే అమరావతిలోనే 13 జిల్లాలకు ఇక నుంచి ఇక్కడి నుంచే  సేవలు అందిస్తారు. గుంటూరు చుట్టుగుంటలోని పాత మార్కెట్‌యార్డు ఆవరణలో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. ఏడాది నుంచి పాత యార్డులో ఉన్న కళ్యాణ మండపాన్ని ఆధునికీకరించారు. అన్ని వసతులతో కార్యాలయాన్ని తీర్చి దిద్దారు. వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో సుమారు 300 మంది పని చేస్తున్నారు. ఆ శాఖ డైరెక్టర్‌ లేదా కమిషనర్‌, అడిషనల్‌ డైరెక్టర్లు, జెడిలు, డిడిలు, ఎడిలు, ఎవోలు ఇతర సిబ్బంది ఇక్కడ పనిచేస్తుంటారు. పాత మార్కెట్‌ యార్డు ఆవరణలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కార్యాలయంతో పాటు ఆయన పరిధిలోని వ్యవసాయ, ఉద్యానవన, సెరికల్చర్‌, మార్కెటింగ్‌ శాఖలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రి పుల్లారావు కార్యాలయంతో పాటు మార్కెటింగ్‌ శాఖ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ నెల 25న కమిషనరేట్‌ను ప్రారంభిస్తున్నారు.హైదరాబాద్‌ నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి వ్యవసాయ శాఖ ప్రత్యేక వసతులు కల్పించింది. గొట్టిపాటి కళ్యాణ మండపం, మురళి గెస్ట్‌హౌస్‌, ప్రశాంతి నిలయం అతిథి గృహాలను వీరి కోసం కేటాయించారు. కార్యాలయంలో అన్ని రకాల సాంకేతిక వసతులను కల్పించారు. చుట్టుగుంట సెంటర్‌లోని కార్యాలయంలో ఇంటర్నెట్‌, వైఫై, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఆన్‌లైన్‌ వంటి అన్ని వసతులను ఏర్పాటు చేశారు.హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లడానికి కొంచం బాధ గానే ఉంది కానీ మన రాజధాని అభివృధి చేసుకోవాలి అంటే కొన్ని కష్టాలు పడవలసిందే అని  అధికారులు తెలియచేశారు . 

Thursday 23 June 2016

చిరు ఫస్ట్ డే షూటింగ్ సెలెబ్రేషన్స్!

చిరు ఫస్ట్ డే షూటింగ్ సెలెబ్రేషన్స్!

chiru 150th movie images
హైదరాబాద్: 
ఎపుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకి ఒక తీపి కబురు ఇది! అది ఏంటి అనుకుంటున్నారా అదేనండి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురువారం సెట్స్‌పైకి వెళ్లి సక్సెస్‌ఫుల్‌గా మొదటిరోజు చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ చరణ్ భార్య ఉపాసన సెట్‌లో కేక్ కటింగ్‌తో సెలబ్రేషన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరుతో పాటు రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, దర్శకుడు వినాయక్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సహా చిత్రయూనిట్ పాల్గొన్నారు. వీరితో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ ఈ ఫస్ట్‌డే షూటింగ్ సెట్‌లో చేసిన కేక్ కటింగ్ సెలబ్రేషన్‌కు హాజరయ్యారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ చిత్రీకరణలో భాగంగా కాశ్మీర్‌లో ఉండటం వలన ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. కొణదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.చిరు 150 వ ఫస్ట్ లూక్ చాలా అందం గా కనిపించాడు .

ఏపీ భవన్‌ను తెలంగాణకే ఇవ్వాలి !

ఏపీ భవన్‌ను తెలంగాణకే ఇవ్వాలి !

KCR iMAGES
హైదరాబాద్:  తెలంగాణ ప్రభుత్వం  కేంద్రానికి లేఖ! ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు అప్పగించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. ఈ సందర్బంగా లేఖ లో  ఏపీ భవన్‌ హైదరాబాద్‌ స్టేట్‌కు చెందిన ఆస్తి అని, దానిని తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది అని . ప్రస్తుతం ఏపీ భవన్‌ ఉన్న ప్రాంతమంతా ఒకప్పటి హైదరాబాద్‌ స్టేట్‌కు చెందినదని అని , మొత్తం 18.8 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. అప్పట్లో భారత ప్రభుత్వం హైదరాబాద్‌ హౌస్‌తో పాటు 7.5 ఎకరాల పటౌడి హౌస్‌, 1.21 ఎకరాల నర్సింగ్‌ ఇనిస్టిట్యూట్‌ తీసుకుని ప్రత్యామ్నాయంగా అప్పటి ఏపీ ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయించారన్నారు. అలాగే నిజాం ఆస్తులను తెలంగాణకు అప్పగించాలని,భవనాలను ఉమ్మడి వనరుల నుంచే నిర్మించారని ఆ లేఖలో పేర్కొన్నారు.

పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగం సక్సెస్ చేసిన ఇస్రో !

పీఎస్ఎల్వీ సీ34 ప్రయోగం సక్సెస్ చేసిన ఇస్రో !

Isro Images in nellor
నెల్లూరు: ఇస్రో చరిత్ర సృష్టించింది. అంతరిక్ష పరిశోధనల్లో తనదైన ముద్రవేసింది. ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి అగ్రదేశాల మధ్య  చేరింది. రష్యా, అమెరికాల తర్వాత స్థానం సంపాదించింది భారత్. ఈ రోజు ఉదయం 9.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ34 రాకెట్ ను ప్రయోగించారు. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా సాగిన ఈ ప్రాజెక్టుపై యావత్తు దేశం పెట్టుకున్న ఆశలను నిలబెట్టింది ఇస్రో టీమ్. ప్రయోగం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, టీఎస్ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.భారత్ అభివృధి కి అని విధాలుగా చేస్తున్నాము అని ఇస్రో  టీం తెలియచేశారు.  

ఒంగోలు దాబా లో టీ తాగిన సీఎం బాబు!

ఒంగోలు దాబా లో టీ తాగిన సీఎం బాబు!

amaravati images
ఒంగోలు :
బుధువారం సాయంత్రం 3 గంటలకి ఒంగోలు కి చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో పాల్గొన్నారు. ఆ సభ లో ప్రకాశం రైతులతో బాబు గారు ముఖ ముఖి మాట్లాడారు. అక్కడికి వచ్చిన రైతులు హర్షం వక్తం చేశారు .‘మీ మేలు జన్మలో మరిచిపోలేం.. మీరు మాకు చేసిన ప్రయోజనం అంతా ఇంతా కాదు. కాలం కలిసి రాక పంటలు పండక అప్పులు తీర్చలేకపోయాం. ఇక ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్న తరుణంలో మీరు మా బ్యాంకు రుణాలను మాఫీ చేసి, మా ప్రాణాలు నిలిపారు. రుణమాఫీతో ఎంతో ఉపశనమనం పొందుతున్నాం’ అంటూ పలువురు రైతులు సీఎ చంద్రబాబుతో తమ ఆనందాన్ని పంచుకొన్నారు.రెండో విడుత రుణ మాపి పాత్రలను అందచేయడానికి వచ్చిన బాబు పై అక్కడి రైతులు ఆనందం వక్త్యం చేశారు.ఈ సభ కార్యక్రమంలో బాబు గారు నాకు చాలా ఆనందంగా గా ఉంది రైతులు ఆనందంగా ఉండమే నాకు ఇష్టం అని తెలియచేశారు రాష్ట్రం కష్టాలో ఉన్నపటికీ ఇచ్చిన మాట తప్పకుండా రైతు రుణమాపీ చేసిన ఘనత ఒక్క టిడిపి పార్టీకే ఉంది అని ప్రసంగించారు.  పర్యటన ముగించుకొని రోడ్డుమార్గాన విజయవాడ వెళ్లారు. మార్గమధ్యలో మద్దిపాడు మండలం గుళ్లాపల్లి సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న దాబా హోటల్‌ వద్ద ఆగి టీ తాగారు. సుమారు 10 నిమిషాలు సీఎం దాబా వద్ద ఆగారు. అక్కడే కొద్దిసేపు కూర్చొని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, రావెల కిషోర్‌బాబు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన, ఆమంచి కృష్టమోహన్‌, ఏలూరి సాంబశివరావు, పాలపర్తి డేవిడ్‌రాజు, గొట్టిపాటి రవికుమార్‌, పోతుల రామారావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరామకృష్టమూర్తి తదితరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒంగోలుకు హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరిగి హెలికాప్టర్‌లోనే వెళ్లాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలంగా లేకపోవడం, చీకటి పడుతుంటంతో రోడ్డు మార్గాన విజయవాడ వెళ్లారు.

Amaravati Telugu News Updates, Amaravati Today News, Chandrababu News, AP News.

Wednesday 22 June 2016

ఆర్నెల్లుగా గ్యాంగ్‌ రేప్‌

ఆర్నెల్లుగా గ్యాంగ్‌ రేప్‌

images
అంతఃపురం: 
ఇంటర్‌ చదువుతున్న ఓ బాలికపై 8 మంది కామాంధులు 6నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. అనంతపురంలో జరుగుతున్న ఘోర సంఘటన . జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లికి చెందిన ఓ గిరిజన బాలికను అనంతపురం నగరంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం డిజైనింగ్‌ కోర్సు అభ్యసిస్తోంది. ఆమె తల్లిదండ్రులు బేల్దారి పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు . పని చేయకపోతే పుట గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తమ కూతురిని ఉన్నత చదువు చదివించాలని జీవీతంలో మంచి స్థాయి కి వెళ్లేవిధంగా ఉండాలి అని చదువు కోసం అనంతపురం నగరానికి పంపారు. అక్కడ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న బాలిక స్నేహితురాలిని అమర్‌నాథ్‌రెడ్డి అనే యువకుడు ప్రేమించేవాడు. ఇంటర్‌ చదువు మధ్యలోనే వదిలేసి అల్లరి చిల్లరగా తిరుగుతుండే అమర్‌నాథ్‌.. తన ప్రియురాలివద్దకు వచ్చినప్పుడు గిరిజన బాలికను చూసి తన పై కన్నేశాడు. హాస్టల్‌ వద్ద దించుతానంటూ ఆరు నెలల క్రితం ఓ రోజు బైక్‌పై ఎక్కించుకుని, నగర శివారులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను సెల్‌లో చిత్రీకరించి... వాటిని ఇతరులకు చూపిస్తానని బెదిరిస్తూ తరచూ ఆమెపై అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. అతనితో పాటు అతని మిత్రుడు కార్తీక్‌రెడ్డి కూడా తరచూ ఆమెపై అఘాయిత్యం చేసేవాడు. తర్వాత వారికి మరో ఆరుగురు తోడయ్యారు. ఒకరి తరువాత మరొకరుగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవారు. నెల క్రితం ఆ బాలిక తండ్రి మృతి చెందాడు. ఈ సమయంలో ఆమె బంధువు ఒకరు ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చేవారు. ఆ సమయంలో ఆమె ఆయనతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొంది. ఆయన ఈ విషయాన్ని మీడియా వాళ్ళకి తెలియజేశారు. దీంతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు వారిపై నిఘా ఉంచారు. మంగళవారం అమర్‌నాథ్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి నగరంలోని 5వరోడ్డులో ఉన్న గిరిజన బాలికను బైక్‌లో ఎక్కించుకుని వెళ్లారు. నగర శివారులోని ప్రసన్నాయపల్లి సమీపంలోకి ప్లాట్ల కోసం ఏర్పాటు చేసిన నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆ బాలికపై ఆత్యాచారానికి పాల్పడేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే వారిపై నిఘా పెట్టిన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు వారి వెనకే అక్కడికి చేరుకోవడంతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అప్పటిదాకా తీవ్ర ఆందోళనకు గురైన బాలిక... తనకు జరిగిన అన్యాయాన్ని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులకు తెలిపి విలపించింది. ఆరు నెలలుగా తనను మానసికంగా, శారీరకంగా వేధించిన వారిని చెప్పుతో కొట్టింది. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు ఇచ్చిన సమాచారం, బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

Tuesday 21 June 2016

ఇచ్చిన మాట తప్పను కాపులకి న్యాయం చేస్తా ?

ఇచ్చిన మాట తప్పను కాపులకి న్యాయం చేస్తా ?

chandrababu images
పశ్చిమగోదావరి జిల్లాలో ఏరువాక ప్రారంభించిన తరువాత  సీఎం చంద్రబాబు ఆ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో ప్రతి ఇంటికి  రూ.149కే ఇంటర్నెట్‌ని అందిస్తామని చంద్రబాబు చెప్పారు.రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడే విధంగా నిర్వహిస్తామన్నారు. యాంత్రీకరణ, ఉత్పత్తిలో ప్రపంచ దేశాలతో మన  రాష్ట్రం  పోటీపడాలని ఆయన సూచించారు.ఈ సవంత్సరం  నుంచి ఈ-క్రాప్‌ విధానం కూడా అమలు చేస్తామన్నారు. కాపులకు ఎంతోమంది హామీలు ఇచ్చి ఏమీ చేయలేదని  కొందరు నేతలు అంటున్నారు అని బాబు చెప్పారు. కాపులకు వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. బీసీ జాబితాలో కాపులను  తప్ప కుండా  ఇచ్చిన మాట నిలబెట్టుకుంట అని  సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.

Amaravati Telugu News Updates, Telugu News For AP, Andhra Pradesh Telugu News.

Monday 20 June 2016

విశాఖ లో బస్సు టెర్మినల్ 250 కోట్ల తో?

విశాఖ లో బస్సు టెర్మినల్ 250 కోట్ల తో?

APS RTC IMAGES
విశాఖపట్నం:  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఆర్టిసి విషయంలో అదునతంగా తీర్చిదిదుతున్నారు ప్రతి దినం ఒక ఒక్క అడుగుగా  అభివుర్ది ఫై పయనిస్తుంది. విశాఖపట్నంలో పూర్తిస్థాయిలో  బస్‌కి సంబదించిన  టెర్మినల్‌ను నిర్మించనున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు గారు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్‌ కాంప్లెక్సులను వినోద కేంద్రాలుగా ప్రజలకి వీలుగా ఉండేవిధంగా  తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. విశాఖలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఆదివారం మొబైల్‌ యాప్‌ కియో్‌స్కను ప్రారంభించారు. అనంతరం, తగరపువలసలో బస్‌ డిపో నిర్మాణాని కోసం  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...  విశాఖలోని మద్దిలపాలెం కూడలిలో ఆర్టిసి సంస్థకు ఉన్న 4. 1/2 ఎకరాల స్థలంలో అహ్మదాబాద్‌, సూరత్‌ తరహాలో రూ.250 కోట్లతో రెండేళ్లలో మంచి ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌ను నిర్మిస్తామన్నారు అని తెలియచేశారు . 
సీఎం ఆదేశాలమేరకి :
ప్రయాణికులపై  ఎటువంటి భారం వేయకుండా ఆదాయం కోసం పార్శిల్‌సు , కొరియర్‌ సర్వీసులను ప్రారంభించామని ఎండి సాంబశివరావు చెప్పారు. గత 35 రోజుల్లో రూ.మూడు వేల కోట్ల వ్యాపారం చేయగలిగామన్నారు. సంస్థలోని  కార్మికుల కోసం అని కార్మికుల సంక్షేమంలో భాగంగా రూ.10 లక్షలతో గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ చేసినట్టు తెలిపారు.కార్మికుల క్షేమము కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి అయిన చేయడానికి ఉంది అని  ఆర్టీసీ బస్సు ప్రమాదం వల్ల ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబాలకు బాధిత గా  24 గంటల్లోగా రూ.5 లక్షల బీమా సొమ్ము అందేలా చేయడానికి ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం టికెట్‌ చార్జీకి అదనంగా రూపాయి చొప్పున ఇన్సూరెన్స సెస్‌ను వసూలు చేస్తున్నట్టు తెలిపారు. పల్లెవెలుగు బస్సులకు ఈ సెస్‌ వసూలు చేయడం లేదని, అయినప్పటికీ బీమా సదుపాయం పల్లె వెలుగు కార్మికులకి కూడా  ఉంటుందన్నారు. ప్రతి నెలా 410 బస్సుల చొప్పున రానున్న 8 నెలల్లో 3,280 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఎండీ సాంబశివరావు 
చెప్పారు. త్వరలోనే డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నామన్నారు.